పాఠశాల వేధింపులే నా కొడుకును బలితీసుకున్నాయి!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం (Kothagudem) పట్టణంలో పదో తరగతి విద్యార్థి నితీశ్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై సందేహాలు వ్యక్తం చేస్తూ విద్యార్థి తల్లి మౌనిక నిరసనకు దిగింది. తన కుమారుడి మరణానికి శ్రీచైతన్య యాజమాన్యమే (School Management) కారణమని ఆరోపించింది. క్లాస్ టీచర్, ప్రిన్సిపాల్ మానసికంగా వేధింపులకు గురిచేశారని తెలిపింది. ఈ ఘటన పై సమగ్రంగా దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఓ బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తూ మానసికంగా వేధింపులకు గురిచేయడం వల్లనే నితీష్ ఆత్మహత్య చేసుకున్నాడని మండిపడింది. తండ్రి లేకపోయినా తన కొడుకును చదివిస్తే, పాఠశాల యాజమాన్యం ప్రాణాలు తీసిందని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>