కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా అధిష్టానం కీలక అడుగు వేసింది. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఏఐసీసీ ప్రత్యేక పరిశీలకు (AICC Observers)లను నియమించింది. ఈ మేరకు మహారాష్ట్ర, ఢిల్లీ, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాలకు సంబంధించి అబ్జర్వర్ లను ప్రకటిస్తూ పార్టీ నాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నియామకాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకులకు ప్రాధాన్యత లభించడం విశేషం. దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్ర పరిశీలకులుగా ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డితో (Raghuveera Reddy) పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజును అధిష్టానం ఎంపిక చేసింది. అలాగే అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర పరిశీలకుడిగా మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలీకి అవకాశం కల్పించింది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు సమర్థులైన వారిని డీసీసీ అధ్యక్షులుగా ఎంపిక చేయడమే ఈ పరిశీలకుల (AICC Observers) ప్రధాన విధి.
Read Also: విమాన ప్రయాణంలో కొత్త రూల్స్: ఇకపై ఆ సీట్లు ఉచితం!
Follow Us On: Sharechat

