Mobile Popup Ad
Mobile Popup Ad

నేడు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రమంత్రి కుమార స్వామి

క‌లం, వెబ్ డెస్క్‌: నేడు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమార‌స్వామి (Kumaraswamy) విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప‌ర్య‌టించనున్నారు. విశాఖ‌లోని న‌క్కప‌ల్లిలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా పరిశ్రమ శంకుస్థాప‌న కోసం ఆయ‌న ఆదివార‌మే విశాఖ‌కు చేరుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షులు ప‌ల్లా శ్రీనివాస్ యాద‌వ్ స్థానికంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను కేంద్ర మంత్రికి వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో మేనేజ్‌మెంట్‌, కార్మిక సంఘాలతో కుమార‌స్వామి వేర్వేరుగా సమావేశం అయ్యే అవ‌కాశం ఉంది. ఆర్థిక ప్యాకేజ్‌ ప్రకటించిన తర్వాత పరిశ్రమ పురోగతి, ఇతర సమస్యలపై చర్చ జ‌రుగ‌నుంది. ఆర్‌ కార్డులు, విమల విద్యాలయం మూసివేత వంటి నిర్ణయాల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని ప‌ల్లా శ్రీనివాస్‌ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>