కలం, వెబ్ డెస్క్: నెట్‌వర్క్ మార్కెటింగ్ సంస్థ క్యూనెట్ (QNet)పై హైదరాబాద్ పోలీసుల దాడులు చేపట్టారు. సోమవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లోని పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం కేసులో ఇప్పటి వరకు 37 మందిని అరెస్ట్ చేశారు. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటకలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. మొత్తం 25 బృందాలతో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో సజ్జనార్ హైదరాబాద్ సీపీగా ఉన్న సమయంలో సైతం క్యూ నెట్‌పై భారీ ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. తాజాగా మరోసారి ఫిర్యాదులు పెరుగుతుండటంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు.
బెంగళూరు, హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే లక్ష్యంగా క్యూనెట్ మోసాలకు పాల్పడింది. సెకండ్ ఇన్‌కం పేరుతో ఉద్యోగులకు ఆశ కల్పించారు. వారికి లోన్లు ఇప్పించి మరీ దోపిడీ చేశారు. ఇప్పటి వరకు పోలీసులు మొత్తం 37 మందిని అరెస్ట్ చేశారు. మూడు రాష్ట్రాల్లో ఏక కాలంలో 25 చోట్ల హైదరాబాద్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌లో 25 మంది, బెంగళూరు, వైజాగ్, విజయవాడలో నలుగురు చొప్పున 12 మందిని అరెస్ట్ చేశారు.

