కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ (SVSN Varma) చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మంత్రి నారా లోకేశ్ భవిష్యత్తులో ఏపీ ముఖ్యమంత్రి కావడానికి అన్ని విధాలా అర్హుడని, ఆయనకంటే మెరుగైన నాయకుడు మరొకరు ఎవరున్నారంటూ అభిప్రాయపడ్డారు. గత ఎన్నికలకు ముందు యువగళం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో లోకేశ్ (Nara Lokesh) కీలక పాత్ర పోషించారన్నారు.
రాజకీయ వ్యూహకర్తగానూ పేరుందన్నారు. పార్టీ కోసం శ్రమిస్తున్న కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసిన గొప్ప మనసున్న నాయకుడని ప్రశంసించారు. అయితే లోకేశ్‌ను కాబోయే సీఎంగా అభివర్ణించడమే కాకుండా, డిప్యూటీ సీఎంగా చేయాలనే డిమాండ్‌ను టీడీపీ నేతలు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వర్మ (SVSN Varma) చేసిన పరోక్ష విమర్శలేనని రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: ‘అధికారం కోసమే ఇదంతా’.. చంద్రబాబుపై మాణిక్యం ఠాగూర్ ఫైర్
Follow Us On: Sharechat

