కాంగ్రెస్‌ కారణంగానే సిక్కు అల్లర్లు: అమిత్ షా

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ కారణంగా సిక్కు అల్లర్లు చోటు చేసుకుని వేలాది మంది బలయ్యారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) విమర్శించారు. 1984, నవంబర్ ఒకటో తేదీన దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన దారుణాలను దేశం ఎప్పటికీ మర్చిపోదన్నారు. వందల మందిని బతికుండగానే కాల్చేశారని.. మరెంతో మంది దేశం విడిచిపోయేలా చేశారని ధ్వజమెత్తారు. ఎంతో మంది వివాహితలు భర్తలను కోల్పోయారని గుర్తు చేసుకున్నారు. తమ కళ్ల ముందే ఇళ్లు దహనమవుతున్నా.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారని అప్పటి పరిణామాలను వివరించారు.

అప్పటి కేసులన్నీ రీ–ఓపెన్..

అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఇచ్చిన ప్రకటనను తానెప్పటికీ మర్చిపోనని అమిత్ షా పేర్కొన్నారు. ఒక పెద్ద చెట్టు పడిపోయినప్పుడు.. భూమి కంపించడం సహజమేనని రాజీవ్ వ్యాఖ్యానించారని.. వేలాది మంది సిక్కులను బలిగొన్న ఘటనను ఉద్దేశించి అలా మాట్లాడటం కాంగ్రెస్ పార్టీ నేతలకే చెల్లిందన్నారు. మోదీ ప్రభుత్వం వచ్చాకే.. సిక్కు అల్లర్ల కేసులను రీ ఓపెన్ చేసి.. అసలు కారణాలు గుర్తించే పనికి పూనుకుందన్నారు. అలాగే.. ప్రతి బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం కూడా ప్రకటించామన్నారు. ఒక రాజకీయ పార్టీ ఇంతలా మారణహోమానికి పాల్పడిన ఘటన చరిత్రలో ఎప్పుడూ జరగలేదని.. ఇక ముందు కూడా జరగబోదని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మండిపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>