పార్థ డెంటల్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : పార్థ డెంటల్ (Partha Dental)  ఆధ్వర్యంలో ఆదివారం మహబూబ్ నగర్ పట్టణంలో షాషా గుట్ట చౌరస్తా సమీపంలో ఉన్న అపోలో ఫార్మసీలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కె. స్రవంతి హాజరై ప్రజలకు ఉచితంగా దంత పరీక్షలు నిర్వహించి, దంత సంరక్షణపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డాక్టర్ స్రవంతి మాట్లాడుతూ..ప్రస్తుతం దేశంలో దంత సంరక్షణపై ప్రజల్లో అవగాహన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. దాదాపు 100 మందిలో 90 శాతం మంది ఏదో ఒక దంత సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే దంత వైద్యుడిని సంప్రదించి తగు సలహాలు, సూచనలు తీసుకోవడం చాలా మంచిదన్నారు. లేని ఎడల చిన్న సమస్యే పెద్దదై పళ్ళు పుచ్చిపోవడం, చిగుళ్ళ నుంచి రక్తం కారడం వంటి అనేక సమస్యలతో బాధపడాల్సి వస్తుందన్నారు.

కాబట్టి సమస్య చిన్నగా ఉన్నప్పుడే వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి సరిచేసుకోవడం మంచిదని సూచించారు.ప్రతి ఒక్కరూ రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవాలని, ఆరు నెలలకోసారి దంత పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కనెక్ట్ మార్కెటింగ్ రామ్ రెడ్డి, పార్థ డెంటల్ పి.ఆర్.ఓ బి. మహేష్ బాబు, క్రాంతి, అపోలో ఫార్మసీ ఇన్చార్జ్ నరేష్ గౌడ్, అపోలో ఫార్మసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>