బాలిక ఆరోగ్య పరిస్థితిపై లోకేష్ కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్: రాప్తాడు జడ్పీ స్కూల్‌లో ఉన్మాది చేతిలో తీవ్రంగా గాయపడిన బాలిక ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పేర్కొన్నారు. అయితే వచ్చే 48 గంటలు అత్యంత ముఖ్యమని.. ఆమె పూర్తి ఆరోగ్యంతో తిరిగి మనందరి ముందుకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను మంత్రి లోకేష్ పరామర్శించారు.

అనంతరం మీడియాతో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఘటన జరిగినప్పటి నుంచి ఎప్పటికప్పుడు బాలిక ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. బాలిక తల్లిదండ్రులతో మాట్లాడానని.. ఆమెకు జీవితాంతం వైద్య సదుపాయం సహా అన్ని రకాలుగా అండగా ఉండే బాధ్యతను తాను, స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత తీసుకుంటామన్నారు. బాలిక తల్లిదండ్రులకు తన నెంబర్ ఇచ్చానని.. ఏ అవసరం ఉన్నా వెంటనే ఫోన్ చేయాలని కోరినట్లు పేర్కొన్నారు.

తాపీ మేస్త్రీ అనుకోవడంతో..

ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని.. కఠినంగా శిక్షించి తీరుతామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. స్కూల్ ఆవరణలో నిర్మాణ పనులు జరుగుతుండటంతో అందరూ అతడిని అక్కడ పనిచేస్తున్న తాపీ మేస్త్రీ కావొచ్చని భావించారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. క్షణాల్లో జరిగిన ఘటనకు అందరూ షాక్‌లో ఉండిపోయారని వివరించారు. విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులు భయాందోళనలో ఉన్నట్లు తనకు తెలియడంతో వెంటనే అక్కడికి సైకాలజిస్టులను పంపించి వారిని మామూలు స్థితికి తీసుకొచ్చేలా కౌన్సెలింగ్ ఇస్తున్నామని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>