కలం, కరీంనగర్: ఏఐసీసీ పిలుపు మేరకు ఓటు చోరీపై నిర్వహిస్తోన్న ‘ఓటు బచావో దేశ్ బచావో’ ర్యాలీ ఢిల్లీలోని రాంలీలా మైదాన్ లో జరుగుతోంది. ఈ భారీ నిరసన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి తరలివచ్చిన నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీ (Delhi Congress Rally) నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్ జాతీయ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, పార్టీ జాతీయాధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యనాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా నుంచి సుడా మాజీ ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి (Komatireddy Narender Reddy) పాల్గొని నిరసన తెలిపారు.

