నేడు కేంద్ర కేబినెట్ భేటీ: ఇంధన ధరలపై కీలక నిర్ణయం !

కలం, వెబ్​ డెస్క్​ : దేశ రాజధాని న్యూ ఢిల్లీలో నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ (Union Cabinet) అత్యవసరంగా భేటీ కానుంది. దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, దానివల్ల ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న అనిశ్చితిపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.

యుద్ధ పరిస్థితుల ప్రభావం భారత్‌పై పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా సామాన్యుడిపై భారం పడే అవకాశం ఉన్న గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల అంశం ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా మారనుంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ సరఫరాలో తలెత్తే అంతరాయాలను ఎలా అధిగమించాలి, ఇంధన ధరలను స్థిరంగా ఉంచడం ఎలా అనే విషయాలపై మంత్రుల బృందంతో (Union Cabinet) ప్రధాని చర్చించనున్నారు. కేవలం ఇంధన ధరలే కాకుండా, మరికొన్ని కీలకమైన ఆర్థిక, విధానపరమైన నిర్ణయాలకు కూడా ఈ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉంది.

Read Also: రాజకీయాలని కుదిపేస్తోన్న డ్రగ్స్ వివాదాలు

Follow Us On: Instagram

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>