ఆ క్లైమాక్స్ ఎవరూ ఊహించరు: వెంకీ అట్లూరి

కలం, సినిమా : తమిళ్ స్టార్ హీరో సూర్య(Suriya), టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ” విశ్వనాథ్ అండ్ సన్స్” (Vishwanath and Sons). లక్కీ భాస్కర్ వంటి సూపర్ హిట్ తరువాత వెంకీ అట్లూరి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నిర్మాత నాగవంశీ ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మించారు. మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కోయంబత్తూర్‌లో గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో దర్శకుడు వెంకీ అట్లూరి సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇది కొత్త తరహా కథతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా.. “2 గంటల 30 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో కనీసం 1 గంట 45 నిమిషాలు ప్రేక్షకులు పూర్తిగా ఎంటర్‌టైన్ అవుతారు. ఇది నా హామీ.. నన్ను నమ్మండి” అని అన్నారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా జెన్-జెడ్ ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుందని ఆయన తెలిపారు. సినిమాలో సూర్య సర్, రాధిక మేడమ్ మధ్య వచ్చే 10 నిమిషాల కామెడీ సీక్వెన్స్ ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తుందని చెప్పారు. అలాగే ఇప్పటివరకు చూడని విధంగా క్లైమాక్స్ ఉంటుందని, ఇది పూర్తిగా కొత్త అనుభూతిని అందించే సినిమా అని వెంకీ అట్లూరి పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>