కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. కొత్త పథకానికి గ్రీన్ సిగ్నల్

కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలోని కేంద్ర కేబినెట్ (Union Cabinet) కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం తీసుకున్న ఈ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కొత్తగా రూ. 33,660 కోట్లతో భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ (Industrial Parks) ఏర్పాటు చేయడమే ఈ పథకం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వంద నుంచి వెయ్యి ఎకరాల పరిధిలో భవ్య ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. 2023-24 ఏడాదికి గాను పత్తి సీజన్‌ ఎమ్ఎస్పీ (MSP) రీయింబర్స్ మెంట్ కి రూ.11,712 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారి-92 (NH-92) బారాబంకి నుండి బహ్రైచ్ సెక్షన్ వరకు నాలుగు లేన్ల నిర్మాణానికి రూ. 6,969 కోట్లు కేటాయిస్తూ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అలాగే చిన్న జల విద్యుత్ అభివృద్ధి పథకానికి రూ.2,585 కోట్లు కేటాయించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>