కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ నగరంలోని మహిళా పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముందుగా స్టేషన్‌లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం మొక్కలు నాటారు. అనంతరం సిబ్బందికి సంబంధించిన కిట్స్, ఆర్టికల్స్ తనిఖీ చేశారు. కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, ఫిర్యాదుల పరిష్కారం, స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను అడిగి తెలుసుకుకున్నారు. మహిళలు, బాలికలకు సంబంధించిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించాలని సూచించారు.
మహిళల భద్రతకు కల్పించేలా కృషి చేస్తూ.. బాధితులకు భరోసా, చట్టపరమైన నిబంధనల ప్రకారం సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. భయాందోళనలు లేకుండా పోలీసులకు తమ సమస్యలు తెలియజేసేలా అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని ఆదేశించారు. ఏసీపీ ప్రకాష్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎస్.శ్రీలత, ఎస్సైలు ఎండీ.రహమతుల్లా, పి.రాజేశ్వర్, పి.జాన్సన్, సిబ్బంది పాల్గొన్నారు.

