కలం, వెబ్ డెస్క్: ఏపీలోని మార్కాపురం(Markapuram) జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) విచారం వ్యక్తం చేశారు. టిప్పర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని ప్రయాణికులు సజీవ దహనం అవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు మార్కాపురం జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో 12 మంది మృతి చెందారని, గాయపడిన మరో 20 మందిని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు సీఎంకు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే సమాచారం పై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. మరోవైపు మంత్రి గొట్టిపాటి ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
జిల్లా ఎస్పీ హర్ష వర్దన్ రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంలో మృతుల్లో ఎక్కువగా 20 నుంచి 30 ఏళ్ల మధ్య వారే ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో సైతం 30 ఏళ్ల లోపు వారే ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది.
Read Also: కాంగోలో ఆగని హింస.. మరణాలపై ఐక్యరాజ్య సమితి ఆందోళన
Follow Us On: Instagram

