కలం, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉజ్జయిని ఎక్స్‌ప్రెస్‌కు (Ujjaini Express) తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. స్టేషన్‌లో రైలు ఇంజిన్ బోగీలను మార్చే ప్రక్రియ జరుగుతుండగా, ఒక్కసారిగా రైలు నియంత్రణ కోల్పోయి వెనక్కి దూసుకెళ్లింది. అదుపుతప్పిన రైలు వేగంతో వెనక్కి వెళ్లి రైల్వే స్టేషన్ రక్షణ గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి పెద్ద శబ్దంతో రక్షణ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో రైలులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో మూడు బోగీలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
Read Also: పుచ్చకాయ తింటే చనిపోతారా? వైరల్ వార్తలపై డాక్టర్ల క్లారిటీ!
Follow Us On: WhatsApp

