కలం, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న వాయుకాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని పలు నగరాల్లో కాలుష్యం విపరీతంగా పెరగిపోతోంది. చలికాలం ప్రారంభం కావడంతో పాటు దీపావళి బాణాసంచా, పంట వ్యర్థాల దహనం, వెహికిల్స్ పొగ, పారిశ్రామిక కాలుష్యం అన్ని కలిసి విషవాయువులను గాలిలోకి వదులుతున్నాయి. దేశంలోని 20 నగరాలు అత్యంత కాలుష్య నగరాలుగా (Most Polluted Cities in India ) నమోదయ్యాయి.
AQI గణాంకాల ప్రకారం దేశంలో అత్యంత కాలుష్య నగరాల జాబితాలో పంజాబ్ లోని భటిండా 771 పాయింట్లతో తొలిస్థానంలో ఉంది. హర్యానాలోని రేవారి 677, పంజాబ్లోని ఫరీద్కోట్ 648 తరువాతి స్థానంలో ఉన్నాయి. తరువాత వరుసగా ఫరీద్కోట్ (648) శ్రీగంగానగర్ (565), సిర్సా(563) పాటియాలా (549) రోహ్తక్ (537), భివాన (512), అలీగఢ్(434), లూథియానా (418) టాప్ 10లో ఉన్నాయి. ఈ జాబితాలో పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన నగరాలే ఎక్కువగా ఉండడం గమనార్హం.

