Mobile Popup Ad
Mobile Popup Ad

మోదీ రావడం ఎప్పటికీ గుర్తుంచుకునే ఒక అద్భుతమైన సాయంత్రం: చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణను పర్యటనలో భాగంగా ఏపీలో సైతం పర్యటించిన ప్రధాని మోదీ.. తన ఇంటికి కూడా రావడంపై సీఎం చంద్రబాబు (Chandrababu) హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తమ నివాసానికి రావడం ఎప్పటికీ గుర్తుంచుకునే ఒక అద్భుతమైన సాయంత్రం అని పేర్కొన్నారు. దేశ ప్రధానికి తమ ఇంటి వద్ద ఆతిథ్యం ఇవ్వడం తమకు దక్కిన గొప్ప గౌరవంగా ఆనందంగా భావిస్తున్నామని చెప్పారు. ప్రధాని చూపిన ఆప్యాయత, అనురాగం ఆయనతో చేసిన సంభాషణ ఈ సందర్భాన్ని ఎంతో ప్రత్యేకంగా మార్చాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణానికి ప్రధాని మోదీ అందిస్తున్న నిరంతర ప్రోత్సాహానికి, మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తమ ఇంటికి విచ్చేసి ఇంతటి ఆత్మీయతను పంచినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. నారా కుటుంబ సభ్యులందరితో ప్రధాని మోదీ ఆత్మీయంగా మాట్లాడిన తీరు అద్భుతమని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న సహకారాన్ని ఈ భేటీ మరింత బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>