Mobile Popup Ad
Mobile Popup Ad

హనీ ట్రాప్ కేసు.. మరో టీడీపీ నేత అరెస్ట్ !

కలం, వెబ్​ డెస్క్​ : అనంతపురం జిల్లాలో కలకలం రేపుతున్న హనీ ట్రాప్ కేసు (Honey Trap Case)లో పోలీసులు మరో కీలక ముందడుగు వేశారు. ఈ ముఠాలో సభ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రుద్రంపేట టీడీపీ నాయకుడు నరేంద్ర రెడ్డిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. మహిళలను ఎరగా వేసి, అమాయకులను ట్రాప్ చేసి, వారి న్యూడ్ ఫొటోలు, వీడియోల ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తూ కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న ఈ ముఠా వెనుక రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ కావడం పెను సంచలనంగా మారింది.

ఈ అక్రమ కార్యకలాపాల్లో అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరులు కీలక పాత్ర పోషించినట్లు విచారణలో వెల్లడైంది. టీడీపీ నేతలు రాజేష్ నాయుడు, రంగమ్మ నాయుడు, నరేంద్ర రెడ్డిల నేతృత్వంలో ఈ ముఠా ఆగడాలు సాగించినట్లు తెలుస్తోంది. కేవలం రాజకీయ అండదండలే కాకుండా, పోలీసుల సహకారం కూడా ఈ ముఠాకు లభించడం గమనార్హం. హనీట్రాప్ ముఠాకు సహకరించారనే ఆరోపణల నేపథ్యంలో రాప్తాడు సీఐ శ్రీహర్ష, అనంతపురం త్రీ టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్‌లపై వేటు పడింది. వీరిద్దరినీ విధుల్లో నుంచి తప్పిస్తూ వీఆర్‌కు బదిలీ చేశారు. మరోవైపు ఈ కేసులో పది మంది కానిస్టేబుళ్ల ప్రమేయంపై కూడా ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి కారణంగా ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>