Mobile Popup Ad
Mobile Popup Ad

అద‌న‌పు క‌ట్నం కోసం అత్తమామలపై అల్లుళ్ల దాడి

కలం, మెదక్ బ్యూరో: సిద్ధిపేట (Siddipet) జిల్లాలో అమానుష ఘ‌ట‌న చోటు చేసుకుంది. అద‌న‌పు క‌ట్నం కోసం ఇద్ద‌రు అల్లుళ్లు అత్త‌మామ‌ల‌పై దాడికి దిగారు. క‌త్తితో దాడి చేయ‌డంతో వృద్ధులు ఆస్ప‌త్రి పాల‌య్యారు. వివ‌రాల్లోకి వెళ్తే… గజ్వేల్ మండలం దిలాల్ పూర్ గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. శ‌నివారం ఇద్దరు అల్లుళ్లు కలిసి అత్త, మామ, భార్య పై కత్తితో దాడి చేశారు. కల్యాణ లక్ష్మి చెక్కు, అదనపు కట్నం కోసం జరిగిన గొడవలో అత్త, మామ, భార్యకి తీవ్ర గాయాల‌య్యాయి. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు స‌మాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>