కొత్తపల్లి ఆర్‌ఎంపీ, పీఎంపీకి కొత్త నాయకత్వం

కలం, కరీంనగర్: కొత్తపల్లి (Kothapalli) మండల ఆర్‌ఎంపీ, పీఎంపీ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల గౌరవ అధ్యక్షుడు, యూనియన్ ఫౌండర్ కొమ్ము గణేష్ ఆధ్వర్యంలో మల్కాపూర్‌లోని ఆర్‌ఎంపీ, పీఎంపీ కార్యాలయంలో సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల అధికారిగా కొమ్ము గణేష్ వ్యవహరించారు.

సభ్యుల ఏకాభిప్రాయంతో మండల అధ్యక్షుడిగా సంపతి స్వామి, ప్రధాన కార్యదర్శిగా కంచర్ల వెంకట రమణాచారి, ట్రెజరర్‌గా పర్లపల్లి రాజమౌళిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగిలిన కార్యవర్గ సభ్యులను వచ్చే నెలలో ఎన్నుకుని, అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు యూనియన్ ఫౌండర్ కొమ్ము గణేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సింహాచలం మారుతి, కాంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎనగందుల సురేష్, వడ్లకొండ నరేష్ గౌడ్, మంగు రామచంద్రు, కొత్తపల్లి మండల ఆర్‌ఎంపీ, పీఎంపీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>