Mobile Popup Ad
Mobile Popup Ad

మద్యం మత్తులో ప్రమాదం.. బావిలో పడిన ఇద్దరు వ్యక్తులు

కలం, మెదక్ బ్యూరో: మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు వ్యవసాయ బావిలో పడిన ఘటన మెదక్ (Medak) జిల్లా చిన్న శంకరంపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై శివానందం తెలిపిన వివరాల ప్రకారం.. మండ భాస్కర్ (59) అతని స్నేహితుడితో కలిసి ఫుల్లుగా మద్యం సేవించారు. అనంతరం వారిద్దరూ నడుచుకుంటూ ఇంటికి బయలుదేరారు.

మద్యం మత్తులో ఉన్న వీరు ప్రమాదవశాత్తు మార్గమధ్యలో ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయారు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారం మేరకు స్థానిక ఎస్ఐ శివానందం సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ చికిత్స నిమిత్తం మెదక్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>