క‌ర్నూలులో ఒకే చోట రెండు రోడ్డు ప్రమాదాలు!

క‌లం, వెబ్ డెస్క్‌: క‌ర్నూలు (Kurnool) జిల్లాలో ఒకే చోట రెండు ఘోర రోడ్డు ప్ర‌మాదాలు జరిగాయి.  ఈ ఘ‌ట‌న‌ల్లో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. జాతీయ ర‌హ‌దారిపై చెన్న‌మ్మ కూడ‌లి వ‌ద్ద బుధ‌వారం తెల్ల‌వారుజామున‌ ఈ ప్ర‌మాదాలు చోటు చేసుకున్నాయి. ముందుగా ఒక లారీ వేగంగా వ‌చ్చి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్ర‌యాణిస్తున్న వ్య‌క్తి అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లంలో స్థానికులు భారీ ఎత్తున గుమిగూడారు. ప్ర‌మాదం జ‌రిగిన తీరును ప‌రిశీలిస్తుండ‌గా మ‌రో లారీ వారిని ఢీకొట్టింది. దీంతో ఇంకొక వ్య‌క్తి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. మ‌రో న‌లుగురు తీవ్ర గాయాల‌పాల‌య్యారు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. క్ష‌తగాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదంపై కేసు న‌మోదు చేసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>