Mobile Popup Ad
Mobile Popup Ad

బీబీనగర్‌లో రెచ్చిపోయిన సైకో.. ఇద్దరికి తీవ్ర గాయాలు!

కలం, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri) లో ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఇద్దరిపై దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరిచాడు. బీబీనగర్ (BB Nagar) మండల కేంద్రంలోని నర్సింగ్ ఆఫీసర్ పై ఆ సైకో కత్తితో దాడి చేశాడు. అంతే కాకుండా ఆ పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్‌లోని వేడి వేడి నూనెను తీసుకుని మరో ట్రాక్టర్ డ్రైవర్ పై పోసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

సైకో దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇది గమనించిన స్థానికులు ఆ సైకోని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం బీబీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>