Mobile Popup Ad
Mobile Popup Ad

గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ‘పాలమూరు’ జాప్యం.. మంత్రి జూపల్లి

కలం, వెబ్ డెస్క్: గత బీఆర్‌ఎస్ (BRS) ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, కేవలం కాలేశ్వరం ప్రాజెక్టుపైనే శ్రద్ధ పెట్టిందని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకులు సరైన భూసేకరణ చేపట్టపోవడంతో ప్రస్తుత ప్రాజెక్టులకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆరోపించారు. ఎలాంటి అవగాహన లేకుండా ఇప్పుడు బీఆర్‌ఎస్ నాయకులు ఉట్టి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం రాష్ట్రంపై రూ. 8 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మిగిల్చిందని గుర్తుచేశారు. వెనుకబడిన పాలమూరు జిల్లాకు మరిన్ని నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులపై దృష్టి సారించిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన అత్యంత వేగంగా పూర్తి చేయడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>