Mobile Popup Ad
Mobile Popup Ad

సుఖోయ్ ప్రమాదం: ఇద్దరు పైలట్లు దుర్మరణం

కలం, వెబ్​ డెస్క్​ : భారత వైమానిక దళానికి (IAF) చెందిన సుఖోయ్-30 (Sukhoi Crash) యుద్ధ విమానం ప్రమాదానికి గురైన ఘటనలో స్క్వాడ్రన్ లీడర్ అనుజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దురాగ్కర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో వారు తీవ్రంగా గాయపడి మరణించినట్లు వైమానిక దళం అధికారికంగా ధృవీకరించింది.

పైలట్ల మృతి పట్ల ఐఏఎఫ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. దేశం కోసం వారు చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ, మరణించిన వీరుల కుటుంబాలకు వైమానిక దళంలోని సిబ్బంది తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఐఏఎఫ్ ప్రకటించింది.

Read Also: ఒకే వేదిక మీదకు సరెండర్ లీడర్స్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>