Mobile Popup Ad
Mobile Popup Ad

సంజూ శాంసన్ విధ్వంసం.. ఫిదా అయిన సీఎస్‌కే కెప్టెన్!

క‌లం, వెబ్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో సంజూ శాంసన్ (Sanju Samson) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వాంఖేడే వేదికగా ఇంగ్లండ్‌పై కేవలం 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు బాది స్టేడియాన్ని హోరెత్తించాడు. వెస్టిండీస్‌పై 97 పరుగులతో అదరగొట్టిన సంజూ, అదే జోరును కొనసాగిస్తూ ఇంగ్లండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.

సంజూ విధ్వంసానికి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) ఫిదా అయ్యాడు. సీఎస్‌కే పోస్ట్ చేసిన వీడియోలో స్కోర్‌కార్డ్ చూసిన రుతురాజ్, “చెట్టా.. సూపర్ చెట్టా” అంటూ సంజూను ఆకాశానికెత్తేశాడు. ఐపీఎల్ 2026 కోసం రూ.18 కోట్లు వెచ్చించి, జడేజా, శామ్ కర్రన్‌లను ఇచ్చి మరీ సంజూను సీఎస్‌కే దక్కించుకున్న సంగతి తెలిసిందే. వచ్చే సీజన్‌లో సంజూ తమ జట్టు తలరాత మారుస్తాడని రుతురాజ్ ధీమా వ్యక్తం చేశాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>