నాది భారతీయ DNA : ఇండోనేషియా అధ్యక్షుడు

కలం, వెబ్ డెస్క్ : ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియంటో (Indonesian President Prabowo Subianto) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు భారతీయ డీఎన్ఏ ఉందని ప్రకటించారు. జకార్తాలో జరిగిన ప్రవాసభారతీయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో భారత ప్రధాని మోదీతో కలిసి ఇండోనేషియా అధ్యక్షుడు పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో ప్రబోవో మాట్లాడుతూ.. గతంలో భారతదేశ పర్యటనకు వెళ్లే ముందు తాను జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్ష చేయించుకున్నట్లు తెలిపారు.

ఇందులో తన డీఎన్ఏను పరీక్షించగా.. భారతీయ డీఎన్ఏ ఉన్నట్లు తేలిందన్నారు. అందువల్లే కావొచ్చు భారతీయ సంగీతం విన్నప్పుడల్లా తెలియకుండానే తన శరీరం కదులుతుందని ప్రబోవో చెప్పుకొచ్చారు. ఇండోనేషి అధ్యక్షుడి వ్యాఖ్యలకు భారతీయులు పెద్ద ఎత్తున్న హర్షధ్వానాలు వ్యక్తం అయ్యాయి. తన క్యాబినెట్ లోని మంత్రులు, సైనిక అధికారుల్లో చాలామందికి కూడా భారతీయ సంగీతం అన్నా.. పాడడం అన్నా ఇష్టం అన్నారు. బహుశా వారిలో కూడా చాలా మందికి భారతీయ డీఎన్ఏ ఉండవచ్చు అని ప్రబోవో పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>