Mobile Popup Ad
Mobile Popup Ad

ఎన్డీయేతో పొత్తుపై టీవీకే విజయ్ సంచలన ప్రకటన

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో టీవీకే విజయ్ (TVK Vijay) గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక రూమర్ వైరల్ అవుతూనే ఉంది. ఈ మధ్య టీవీకే పార్టీ ఎన్డీయేతో పొత్తు పెట్టుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ మధ్యవర్తిత్వం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టీవీకే అధినేత విజయ్ స్పందించారు. తాను ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీయేతో పొత్తులు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు కావాలనే ఇలాంటి ఊహాగానాలు సృష్టిస్తున్నారని.. అవన్నీ ఫేక్ అంటూ కొట్టిపారేశారు టీవీకే విజయ్ (TVK Vijay). తన పార్టీ సిద్ధాంత పరంగా బీజేపీతో వ్యతిరేకిస్తుందని.. ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతానంటూ తేల్చి చెప్పేశారు విజయ్. దీంతో విజయ్ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. ఇక తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎన్నో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే పార్టీతో పాటు అటు శశికల (Sasikala) కూడా కొత్త పార్టీ ప్రకటించారు. ఇంకోవైపు డీఎంకే పార్టీతో డీఎండీకే పొత్తు పెట్టుకుంది. పన్నీర్ సెల్వం కూడా స్టాలిన్ తో చేతులు కలిపారు. ఇలా రకాల పొత్తులు తమిళనాడులో ఆసక్తి రేపుతున్నాయి.

Read Also: గ్యాస్ బుకింగ్.. ఔటాఫ్ కవరేజ్

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>