పిచ్చిపిచ్చిగా ఉందా.. రౌడీషీట్ ఓపెన్ చేస్తా, పాలకుర్తి ఎస్ఐ దౌర్జన్యం

కలం, జనగామ: జనగామ (Jangaon) జిల్లా పాలకుర్తి ఎస్ఐ పవన్ కుమార్ రెచ్చిపోయారు. స్థానిక సమస్యలపై ఎమ్మెల్యేను ప్రశ్నించిన జనాలపై ఆయన ప్రతాపం చూపారు. ‘పిచ్చిపిచ్చిగా ఉందా? రౌడీ షీట్ ఓపెన్ చేస్తా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుర్తి (Palakurthy) మండలం అయ్యంగారిపల్లి గ్రామంలో ఇందిరా మహిళాశక్తి భవన భూమిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హాజరయ్యారు. ఆ భూమి పాఠశాల క్రీడా ప్రాంగణం కోసం ఏర్పాటు చేసిందని, వేరే ప్రభుత్వ భూమిలో మహిళాశక్తి భవనం నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేశారు.

క్రీడా ప్రాంగణం కోసం కేటాయించిన భూమిలో ఎలా నిర్మాణం చేస్తారని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో గందరగోళం నెలకొనడంతో కొందరు వీడియో తీశారు. ఆ సమయంలో ఎమ్మెల్యే పీఏ రాజేశ్ గౌడ్ ఫోన్ లాక్కున్నాడు. ఇదేంటని ప్రశ్నించిన స్థానికులను అక్కడే ఉన్న ఎస్‌ఐ పవన్ కుమార్ (SI Pawan Kumar) బెదిరంచారు. “నీ అంతు చూస్తా, మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తా” అంటూ జనాలపై రెచ్చిపోయారు. తమను బెదిరించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఉన్నతాధికారులను కోరారు.

Read Also: ఏడాదికొక్కసారి.. అసెంబ్లీలో కేసీఆర్ అటెండెన్స్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>