కాంగ్రెస్ పార్టీకి విజ‌య్ తండ్రి బంప‌రాఫ‌ర్!

క‌లం వెబ్ డెస్క్: TVK – Congress | త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ఆస‌క్తిక‌ర మ‌లుపు తిప్పుకోబోతున్నాయి. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా విజ‌య్ (Vijay) పార్టీ టీవీకే ఘ‌న విజ‌యం దిశ‌గా దూసుకెళ్తోంది. కొత్త పార్టీ అయినా టీవీకేకు త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ ర‌థం ప‌ట్టారు. సుమారు వంద‌కు పైగా స్థానాల్లో టీవీకే గెలిచే ఛాన్స్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. 234 సీట్లు ఉన్న త‌మిళ‌నాడులో మ్యాజిక్ ఫిగ‌ర్ 118 సీట్లు. విజ‌య్ పార్టీ అత్య‌ధిక సీట్లు సాధించినా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సీట్ల కంటే త‌క్కువ స్థానాలే ద‌క్కే ఛాన్స్ ఉంది. ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాడులో కూట‌ముల ఏర్పాటు హాట్ టాపిక్‌గా మారింది.

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై విజ‌య్ (TVK Vijay) తండ్రి ఎస్ఏ చంద్ర‌శేఖ‌ర్ (Chandrasekhar) ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్య‌లు చేశారు. కాబోయే సీఎంకు శుభాకాంక్ష‌లు అంటూ విజ‌య్‌కి విషెస్ చెప్పారు. అలాగే చంద్ర‌శేఖ‌ర్ కాంగ్రెస్ పార్టీకి ఓ బంప‌రాఫ‌ర్ ఇచ్చారు. ఎప్ప‌టి నుంచో కాంగ్రెస్ (Congress) పార్టీ పొత్తులు పెట్టుకొని త‌న ప్రాభ‌వాన్ని కోల్పోయింద‌ని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ టీవీకేతో క‌లిస్తే మ‌ళ్లీ పూర్వ వైభ‌వాన్ని పొంద‌వ‌చ్చ‌ని చెప్పారు. విజ‌య్ సీఎం అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ స‌హ‌కారం కావాల‌ని చంద్ర‌శేఖ‌ర్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఎన్నిక‌ల ముందు కాంగ్రెస్‌, బీజేపీలు టీవీకేతో పొత్తు కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేశాయి. కానీ, విజ‌య్ ఎలాంటి పొత్తులు పెట్టుకోకుండా ఒంట‌రిగానే బ‌రిలో దిగి స‌త్తా చాటారు. మ‌రి విజ‌య్ తండ్రి చంద్ర‌శేఖ‌ర్ ప్ర‌పోజ‌ల్‌పై కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో వేచి చూడాలి.

చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ.. విజ‌య్ చాలా సంవ‌త్స‌రాల నుంచి ప్ర‌జా సేవ‌పై దృష్టి పెట్టార‌ని , స‌మాజం కోసం ఏదో ఒక‌టి చేయాల‌న్న ఆలోచ‌న‌లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌ని అన్నారు. ఇప్పుడు ఏకంగా త‌మిళ‌నాడు సీఎం అయ్యే అవ‌కాశం ద‌క్కింద‌న్నారు. అదే విధంగా విజయ్‌కి ప్రజల్లో విస్తృత ఆదరణ ఉందని, మహిళలు, యువత, వృద్ధులు అందరూ ఆయనతో ఎమోష‌న‌ల్ అటాచ్‌మెంట్ క‌లిగి ఉన్నారి స్ప‌ష్టం చేశారు. ఒక ప‌క్క టీవీకే ఘ‌న విజ‌యం త‌మిళ‌నాడుతో పాటు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన వేళ చంద్ర‌శేఖ‌ర్ నోటి నుంచి వ‌చ్చిన పొత్తుల వ్య‌వ‌హారం మ‌రింత హాట్ టాపిక్‌గా మారింది. విజయ్‌కు ఎవరి నుంచి మద్దతు లభిస్తుంది?.. ఏ పార్టీ సపోర్టు ఇవ్వడానికి ముందుకొస్తుంది?.. డీఎంకే, అన్నాడీఎంకేలలో గెలిచిన ఎమ్మెల్యేలలో కొందరు విజయ్‌వైపు వస్తారా?.. ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలుగానే ఉన్నాయి. పూర్తిస్థాయిలో ఫలితాలు వెల్లడైన తర్వాత తదుపరి స్ట్రాటెజీపై విజయ్ దృష్టి సారించనున్నారు. ఇది తేలేంత వరకు అనిశ్చిత పరిస్థితే కొనసాగనున్నది.

Read Also: కేర‌ళ‌లో హామీలు నెర‌వేర్చేందుకు క‌ష్ట‌ప‌డ‌తాం: ప్రియాంకా గాంధీ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>