తమిళనాడు ఎన్నికల్లో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన ఎమ్మెల్యే మృతి!

కలం, వెబ్ డెస్క్: తమిళనాడులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అధికార టీవీకే పార్టీ ఎమ్మెల్యే వీఎస్ బాబు (MLA VS Babu) గుండెపోటుతో మరణించారు. ఆయన కొళత్తూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధినేత, మాజీ సీఎం స్టాలిన్‌ను ఓడించి సంచలనం సృష్టించిన 75 ఏళ్ల వీఎస్ బాబు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న ఆయన మధ్యాహ్నం 2.24 గంటలకు తీవ్రమైన గుండెపోటుతో మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. వీఎస్ బాబు మృతిపై సీఎం విజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన సమయంలో వీఎస్ బాబు సీఎం విజయ్ సిగ్నేచర్ స్టైల్‌ చేతులు ఊపడం అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవడమే కాకుండా.. మీమ్‌గా కూడా మారిపోయింది.

టీవీకే పార్టీకి సవాల్..

వీఎస్ బాబు (MLA VS Babu) మరణంతో ఎన్నికల నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా ఎన్నిక జరగాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో స్టాలిన్ ఓడిపోవడంతో మరోసారి బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనకు తగిన ప్రత్యర్థిని ఎంపిక చేయడం టీవీకే పార్టీకి సవాల్‌గా మారనుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇటీవలే రెండు అసెంబ్లీ ఉప ఎన్నికలను నెగ్గిన సీఎం విజయ్‌కు.. కొళత్తూర్ నియోజకవర్గాన్ని తిరిగి సాధించుకోవడం అంత సులువు కాదంటున్నారు. ఏకంగా డీఎంకే అధినేతనే పోటీలో ఉండబోతున్న నేపథ్యంలో.. తమిళ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారబోతున్నాయి. ఇప్పటికే డీఎంకే పార్టీని అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్ నడిపిస్తుండగా.. స్టాలిన్ గెలిస్తే విజయ్‌కు రాజకీయ ఉక్కపోత తప్పదనే చర్చ జరుగుతోంది.

Also Read : దావూద్ నివసించిన భవనంపై బీఎంసీ బుల్డోజర్!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>