కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామివారిని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కో-ఆపరేటివ్ సంస్థ ఛైర్మన్(TVCC Chairman) ముత్తినేని వీరయ్య కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. యాదాద్రి (Yadadri) క్షేత్రానికి చేరుకున్న ఆయన కుటుంబ సభ్యులు సాంప్రదాయబద్ధంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు.
అనంతరం స్వయంభు నరసింహస్వామివారిని దర్శించుకున్న ముత్తినేని వీరయ్యకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదంతో పాటు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగులు కొణిదెల నరేష్, అనుంతుల ఎల్లారెడ్డి, ఎస్కే షబ్బీర్, కారింగుల యాదగిరి, ఎర్ర వీరయ్య, జాలపు సిద్ధారెడ్డి, గుండు వెంకటేష్, గొన్నేల వెంకటేష్, ఆరే లక్ష్మీనారాయణ, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.

