బీఆర్ఎస్ ఖాతాలో నార్ముల్ మదర్ డైరెక్టర్ పదవి.. జగదీష్ రెడ్డి హర్షం

కలం, యాదగిరిగుట్ట : నార్ముల్ మదర్ డైరెక్టర్ పదవిని బీఆర్ఎస్ పార్టీ గెలిచేందుకు కృషి చేసిన గొంగిడి దంపతులకు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy ) అభినందించారు. సోమవారం జరిగిన నార్ముల్ మదర్ డైరెక్టర్ పదవి బీఆర్ఎస్ పార్ గెలుపొందడానికి కృషి చేసిన గొంగిడి సునిత, మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిని ఆయన ప్రశంసించారు.

అనంతరం డైరెక్టర్​ గా గెలుపొందిన దొంతిరి సోమి రెడ్డిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మదర్ డెయిరీ చైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డి, యాదగిరిగుట్ట మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ పాపట్ల నరహరి డైరెక్టర్లు సంధిల్ల భాస్కర్ గౌడ్, ఒగ్గు బిక్షపతి, కస్తూరి పాండు, మైలార్ గూడెం గ్రామ సర్పంచ్ మారెడ్డి కొండల్ రెడ్డి, రమణ రెడ్డి, సతీష్ రెడ్డి, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>