మొక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్.. నిధులు విడుదల

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం మొక్కజొన్న రైతులకు (Maize Farmers) గుడ్ న్యూస్ చెప్పింది. మొక్కజొన్న రైతులకు నిధులు విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao) ప్రకటించారు. లక్ష మంది రైతుల ఖాతాల్లో రెండు మూడు రోజుల్లో రూ. 1,173 కోట్లు జమ కానున్నట్లు మంత్రి వివరించారు. మొక్కజొన్న సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు నెలకొల్పిందని.. ఇప్పటికే 14 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరణ జరిపినట్లు తెలిపారు. రాష్ట్రంలో గోడౌన్ లతో పాటు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా పొరుగు రాష్ట్రాల్లోని గోదాములు కూడా మొక్కజొన్నను తరలించినట్లు పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>