గజ్వేల్‌లో బీఆర్ఎస్ రైతు దీక్ష.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

కలం, మెదక్ బ్యూరో: ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. దీనికి నిరసనగా సిద్దిపేట (Siddipet) జిల్లా గజ్వేల్ (Gajwel) వ్యవసాయ మార్కెట్ యార్డు ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు దీక్ష, వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఆరోపించారు. రైతులకు అన్యాయం జరగకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>