కలం, ఖమ్మం బ్యూరో: వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) సూచించారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్ దత్, వైరా, సత్తుపల్లి ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, మట్టా రాగమయి దయానంద్‌లతో కలిసి మంత్రి తుమ్మల మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన (Tummala Nageswara Rao) మాట్లాడుతూ.. భారత వాతావరణ శాఖతో పాటు పలు అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కారణంగా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఖరీఫ్ వ్యవసాయ ప్రణాళికను సిద్ధం చేయడం జరిగిందన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి ఇతర పంటల సాగును ప్రోత్సహించాలని, ఇతరలుకు అవగాహన కల్పించాలని కోరారు.
Read Also: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భుజంగరావు అరెస్ట్
Follow Us On : WhatsApp

