మ్యాంగో జ్యూస్ తాగుతున్నారా?.. అయితే జాగ్రత్త!

కలం, వెబ్ డెస్క్: వేసవి కాలం వచ్చిందంటే చాలు చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ తాగేందుకు ఇష్టపడేది మ్యాంగో జ్యూస్ (Mango Juice). అయితే మార్కెట్లో దొరికే ఈ పండ్ల రసాలు మంచివని మనం భావిస్తాం. కానీ వ్యాపారులు మాత్రం ప్రజల ప్రాణాలు లెక్కచేయకుండా వారికి లాభమే ముఖ్యం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల గుజరాత్‌లో (Gujarat) జ్యూస్ తయారీ కోసం పురుగులతో నిండిపోయిన మామిడి పండ్లను ఉపయోగించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గుజరాత్ (Gujarat) లోని పలు జ్యూస్ సెంటర్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో భాగంగా ఓ జ్యూస్ సెంటర్ లో పూర్తిగా బూజు పట్టి, లోపల పురుగులతో నిండిపోయిన మామిడి పండ్లను అధికారులు గుర్తించారు. నిల్వ ఉంచిన టన్నుల కొద్దీ కుళ్లిన మామిడి పండ్లను సీజ్ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఈ పండ్ల స్థితిని చూసి అధికారులు సైతం షాకయ్యారు. ప్రజల ప్రాణలతో చెలగాటం ఆడుకుంటూ ఇటువంటి కల్తీ వ్యాపారాలకు పాల్పడుతున్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తీవ్రంగా హెచ్చరించారు.

Read Also: గులాబీ రేకులతో మెరిసే చర్మం.. ఈ బ్యూటీ టిప్స్ మీకోసమే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>