Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీకి ఆంధ్రా అనే ఉనికి లేదు : పవన్​ కల్యాణ్​

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ అనే ఉనికి ఉంది.. కానీ, ఏపీకి ఆంధ్రా అనే ఉనికి లేదని ఆంధ్రప్రదేశ్​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pawan Kalyan) అన్నారు. అమరావతిలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు నాంది పలికారని కొనియాడారు. అలాంటి మహనీయుడికి కూడా కులం అంటగట్టారని విమర్శించారు.

అలాగే, తెలంగాణలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సభ నిర్వహణకు అనుమతి నిరాకరణపై స్పందించారు. తమిళనాడు, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాలకు వెళ్లినా ఎలాంటి ఇబ్బందులు రాలేవన్నారు. ఈ వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డికి తెలియకపోవచ్చని చెప్పారు. దేశంలో ఎక్కడికి వెళ్లైనా బతికే హక్కు అందరికీ ఉందన్నారు. తెలంగాణలో పోటీ చేయాలనుకుంటుంది ఆ భూమిపుత్రులేనని ఆయన స్పష్టం చేశారు. కేటీఆర్ తనకు సోదరసమానుడని చెప్పుకొచ్చారు.

Read Also: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భుజంగరావు అరెస్ట్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>