బ్యాడ్మింటన్‌లో భారత్ హవా.. భవిష్యత్ ఛాంపియన్లు రెడీ!

కలం, స్పోర్ట్స్ : భారత బ్యాడ్మింటన్ (India Badminton) భవిష్యత్తుపై సరికొత్త జోష్ కనిపిస్తోంది. భవిష్యత్తులోనూ అంతర్జాతీయ వేదికలపై భారత్ తన హవాను ఇలాగే కొనసాగిస్తుందని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) సెక్రటరీ జనరల్ సంజయ్ మిశ్రా గట్టి ధీమా వ్యక్తం చేశారు. 2026 ఆగస్టు 17 నుండి 23 వరకు న్యూఢిల్లీలో జరగబోయే బిడబ్ల్యూఎఫ్ (BWF) వరల్డ్ ఛాంపియన్ షిప్స్ అధికారిక మాస్కట్, యాంథమ్ లాంచ్ శనివారం ఢిల్లీలోని ‘ది లలిత్’ హోటల్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన యువ షట్లర్లపై ప్రశంసల వర్షం కురిపించారు.

గత కొన్నేళ్లుగా అసోసియేషన్ తీసుకున్న చర్యల వల్ల జూనియర్ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. గౌహతిలోని నేషనల్ సెంటర్ ఏర్పాటు తర్వాత అండర్-15, 17, 19 విభాగాల్లో మన జూనియర్లు దూసుకుపోతున్నారు. రోనక్ చౌహాన్, ఉన్నతి హుడా, తన్వి శర్మ లాంటి ప్లేయర్లు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా యూఎస్ ఓపెన్‌లో ప్రపంచ నంబర్ 6 ప్లేయర్‌ను రోనక్ ఓడించడం విశేషం. అలాగే లక్ష్యసేన్ తర్వాత ఆయుష్ శెట్టి, రోనక్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు మనకు ఉన్నారని మిశ్రా ఐఏఎన్ఎస్ (IANS) ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రాబోయే రెండు మూడేళ్లలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుందన్నారు.

కేవలం పతకాలే కాకుండా క్రీడా రంగాన్ని బలోపేతం చేయడంపై కూడా అసోసియేషన్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆటగాళ్ల బేసిక్స్ బాగుండాలంటే గ్రాస్‌రూట్ కోచింగ్ ఎంతో ముఖ్యం. అందుకోసం కోచ్‌లు, టెక్నికల్ అఫిషియల్‌కు ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. క్రీడాకారుల ఫిట్‌నెస్ కోసం స్పోర్ట్స్ సైన్స్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ (SNC)పై కూడా గట్టిగా పని చేస్తున్నారు. టాప్ ప్లేయర్లు అయిన సాత్విక్-చిరాగ్ జోడీతో పాటు ప్రతి ఒక్కరికీ కోచ్, ఫిజియో, ట్రైనర్, మేనేజర్లను పంపిస్తూ నూటికి నూరు శాతం మద్దతు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>