కలం, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం టీటీడీ (TTD) ఈ రోజు పలు రకాల టికెట్లు విడుదల చేయబోతుంది. ఉదయం 10 గంటలకు అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్న నేపథ్యంలో శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. ప్రత్యేక ప్రవేశ దర్శన సోమవారం ఉదయం 10 గంటలకు ఇవ్వనున్నారు.
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల స్లాటెడ్ దర్శన టోకెన్లను ఈ-డిప్ ద్వారా భక్తులకు అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఇందుకోసం డిసెంబర్ ఒకటో తేదీ నుంచి 5వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని టీటీడీ సూచించింది. పొందినవారికి డిసెంబర్ 7న టోకెన్లు కేటాయించనుంది. డిసెంబర్ 20, 21వ తేదీల్లో ప్రోటోకాల్ దర్శనాలన పూర్తిగా నిలిపేసింది. భక్తులు టికెట్ బుకింగ్స్ పూర్తిగా అధికారిక వెబ్ సైట్ ద్వారా చేసుకోవాలని.. నకిలీ వెబ్ సైట్లను నమ్మొద్దని హెచ్చరించింది.

