తిరుప్పరంకుండ్రం కొండపై నేడు కార్తీక దీపం

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులోని మధురై సమీపంలో ఉన్న తిరుప్పరంకుండ్రం (Thiruparankundram) కొండపై నేడు కార్తీక దీపం వెలిగించేందుకు సర్వం సిద్ధమైంది. సుప్రీంకోర్టు జారీ చేసిన కీలక ఆదేశాల నేపథ్యంలో ఈరోజు కొండపై దీప జ్వాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల పర్యవేక్షణలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

దీపం వెలిగించే అంశంపై గత కొంతకాలంగా నెలకొన్న వివాదానికి ముగింపు పలుకుతూ సుప్రీంకోర్టు స్పష్టమైన అల్టిమేటం జారీ చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసేందుకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) బలగాలు ఇప్పటికే మధురై చేరుకుని, తిరుప్పరంకుండ్రం కొండపై భద్రతా బాధ్యతలను స్వీకరించాయి. కేంద్ర బలగాలు కొండ వద్దకు చేరుకున్న సమయంలో స్థానిక ప్రజలు వారిపై పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణ, కేంద్ర బలగాల భారీ భద్రత నడుమ నేడు జరగనున్న కార్తీక దీపం వేడుకపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>