రోజూ ఈ ఒక్క ఆహారం తింటే.. మీ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!

కలం, వెబ్ డెస్క్: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనం తినే ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. బయట దొరికే జంక్ ఫుడ్స్, పాలిష్ చేసిన బియ్యం, మైదా వంటివి ఎక్కువగా తినడం వల్ల చిన్న వయసులోనే షుగర్, ఒబేసిటీ, నీరసం, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యల నుండి బయట పడి మనం ఆరోగ్యంగా ఉండాలంటే పాతకాలపు ఆహారపు అలవాట్లను మళ్లీ మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అందులో ముఖ్యమైంది సిరిధాన్యాలలో రారాజుగా పిలవబడే రాగులు (Ragi Benefits). రాగులను మన రోజూవారీ ఆహారంలో భాగం చేసుకోవడం ఒక అద్భుతమైన పరిష్కారం అని చెబుతున్నారు.

తక్కువ ధరలో దొరికే రాగులను మన ఆహారంలో భాగం చేసుకోవడం వలన కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా అందుతాయని చెబుతున్నారు. అయితే రాగులను రోజూ తీసుకోవడం వలన ఎటువంటి ప్రయోజనాలు (Ragi Benefits) కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రాగులు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఎములకు బలం: రాగులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇవి రోజూవారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చిన్న పిల్లల ఎముకలు, దంతాలు ధృడంగా పెరుగుతాయి. అంతేకాకుండా పెద్దవారిలో వచ్చే కీళ్లనొప్పులు, ఎముకల బలహీనత తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

షుగర్ నియంత్రణ: షుగర్ వ్యాధి ఉన్నవారికి రాగులు చాలా బాగా ఉపయోగపడతాయి. రాగులు తిన్న తర్వాత నెమ్మదిగా జీర్ణమవుతాయి. దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగకుండా అదుపులో ఉంటాయి.

బరువు తగ్గుదలకు: రాగులలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కావున వీటిని కొద్దిగా తిన్నా ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉంటుంది. ఫలితంగా చిరుతిళ్లు తినడం తగ్గి, సులభంగా బరువు అదుపులోకి వస్తుందని చెబుతున్నారు నిపుణులు.

రక్తహీనత తగ్గుతుంది: రాగులను సరైన పద్ధతిలో తీసుకుంటే రక్తహీనత తగ్గడానికి, రాకుండా నివారించడానికి ఎంతో సహాయపడుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా అలసట, నీరసం వంటి సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంటుంది.

జీర్ణశక్తి మెరుగుపడుతుంది: మన తిన్న ఆహారం సులభంగా జీర్ణం కావాలంటే అందులో ఫైబర్ కంటెంట్ ఉండాలి. మన రోజువారీ ఆహారంలో రాగులను భాగం చేసుకోవడం వలన రాగులలో ఉండే ఫైబర్ వల్ల తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారికి రాగులు ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు నిపుణులు.

Note: ఈ సమాచారం కేవలం పాఠకుల ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. మీ ఆహార అలవాట్లలో మార్పు చేసుకునే ముందు ఖచ్చితంగా ఫ్యామిలీ డాక్టర్‌ని లేదా పోషకాహార నిపుణులను సంప్రదించాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>