Mobile Popup Ad
Mobile Popup Ad

దివ్వెల మాధురికి టిటిడి షాక్​.. పోలీసులకు ఫిర్యాదు

కలం, వెబ్​ డెస్క్​ : తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరించారనే ఆరోపణలపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ దివ్వెల మాధురి (Divvela Madhuri), తనూజలపై టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమల క్షేత్రంలో వీరు తమ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. క్షేత్ర నిబంధనల ప్రకారం తిరుమల కొండపై ఇలాంటి ప్రైవేట్ వేడుకలు నిర్వహించడం, వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పూర్తిగా నిషేధమని టీటీడీ తెలిపింది.

ఈ ఘటనపై ఇప్పటికే విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు అందగా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి పద్ధతులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అధికారులు పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>