కలం, వెబ్‌డెస్క్: తమిళనాడు సీఎం, స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన చివరి సినిమా జన నాయగన్ (Jana Nayagan) విడుదలకు సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో ఈ సినిమా ప్రపంచ వ్యప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే యూఎస్ ప్రీమియర్స్‌లో రిలీజ్ అయిపోయింది. ఇక విజయ్ నటించిన చివరి సినిమా కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. భారీ కటౌట్లు, బ్యానర్లతో విజయ్‌పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
జన నాయగన్ సెన్సార్ వివాదాలు, మూవీ ఫుటేజ్ లీకేజ్ వంటి సమస్యలను ఎదుర్కొని వార్తల్లో నిలిచింది. జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ నెలల తరబడి నిరీక్షించారు. దాదాపు 34 ఏళ్ల యాక్టింగ్ కెరీర్‌కు స్వస్తి చెబుతూ విజయ్ చేసిన ఈ చివరి సినిమాను వీక్షించేందుకు తమిళనాడు సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్ల వద్ద అభిమానులు భారీగా తరలివచ్చి కోలాహలం చేస్తున్నారు. మరి విజయ్ చివరి సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వేచి చూడాలి.

