Mobile Popup Ad
Mobile Popup Ad

తిరుమ‌ల కొండ‌ల్లో కార్చిచ్చు!

క‌లం, వెబ్ డెస్క్‌: తిరుమ‌ల కొండ‌ల్లో (Tirumala Hills) కార్చిచ్చు క‌ల‌క‌లం రేపింది. కాకుల‌మాను దిబ్బ ప్రాంతంలో మంట‌లు (Fire) చెల‌రేగాయి. శుక్ర‌వారం ఉద‌యం విండ్ మిల్స్ ప‌క్క‌నే మంట‌లు ఎగిసిప‌డ్డాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని మంట‌ల‌ను అదుపు చేశారు. రెండు ఫైర్ ఇంజిన్లు మంట‌లు ఆర్పేందుకు చాలా సేపు శ్ర‌మించాయి. ఫైర్ సిబ్బంది స‌కాలంలో స్పందించ‌డంతో కొండ మీద పెను ప్ర‌మాదం త‌ప్పింది. ట్రాన్స్‌ఫార్మ‌ర్ ప‌క్క‌నే ప్ర‌మాదం జ‌ర‌గ‌డం ఆందోళ‌న క‌లిగించింది. అయితే ప్ర‌మాదం ఏ కార‌ణంతో జ‌రిగింద‌న్న దానిపై స్ప‌ష్ట‌త రాలేదు. ఎండ తీవ్ర‌త‌తో జ‌రిగిందా? లేక ఎవ‌రైనా కావాల‌నే త‌గుల‌బెట్టారా అనే దానిపై అట‌వీ శాఖ అధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>