ఆదిలాబాద్ కలెక్టర్‌ ను కలిసిన రిమ్స్‌ నూతన సూపరింటెండెంట్

కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్‌ (RIMS Adilabad) నూతన మెడికల్‌ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ వెంకట్‌ లకావత్‌ మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ రాజర్షి షాను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పూల మొక్కను అందజేశారు. రిమ్స్‌లో వైద్య సేవలు, ఆసుపత్రి అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ నూతన సూపరింటెండెంట్‌కు అభినందనలు తెలియజేస్తూ, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేయాలని సూచించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>