కలం, వెబ్‌డెస్క్: ఢిల్లీలో సోనియా గాంధీ ఆత్మకథ బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) తన ఇంట్లో 22 ఏళ్లుగా పని చేస్తున్న ఓ మహిళ చిరకాల కోరిక నెరవేర్చారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి కాంగ్రెస్ అగ్ర నేతలు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రియాంకా గాంధీ ఇంట్లో పని చేస్తున్న ఓ మహిళ సీఎం విజయ్‌ని కలవాలని, ఆయనతో కలిసి ఫొటో దిగాలని ఎప్పటి నుంచో ఆశపడుతున్నారు.
ఆమెకు విజయ్‌పై ఉన్న అభిమానాన్ని గుర్తించిన ప్రియాంక గాంధీ ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వయంగా ఆమెను విజయ్‌కు పరిచయం చేశారు. అంతేకాకుండా ఆమెతో కలిసి ఫొటో దిగాలని విజయ్‌ని కోరారు. ఇందుకు విజయ్ సంతోషంగా అంగీకరించి ఆమెతో ఫొటో దిగారు. దీంతో ఆ మహిళ చిరకాల కోరిక నెరవేరింది. తన ఇంట్లో పని చేసే మహిళ కోరికను గుర్తించి ప్రియాంక గాంధీ ఇలా ప్రత్యేకంగా స్పందించడం అందరి దృష్టిని ఆకర్షించింది. మరోవైపు విజయ్ కూడా ఎంతో ఆప్యాయంగా ఆమెతో ఫొటో దిగారు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రియాంక గాంధీతో పాటు సీఎం విజయ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

