భారత్ పై ట్రంప్ అక్కసు .. ‘నరకం’ అంటూ పోస్ట్

కలం, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Trump) భారత్ పై మరోసారి విషం వెల్లగక్కాడు. పుట్టుకతో వచ్చే పౌరసత్వం (Birthright Citizenship) పై రెచ్చగొట్టే విధంగా పోస్ట్ చేశాడు. ప్రముఖ రచయిత మైఖేల్ సావేజ్‌కు చెందిన ఓ లేఖను ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో రీపోస్ట్ చేయడంతో ప్రస్తుతం వివాదానికి దారితీసింది. ప్రస్తుత న్యాయ వ్యవస్థ, వలసదారులు గర్భం దాల్చిన తొమ్మిదో నెలలో అమెరికాకు రావడం వల్ల దేశ చట్టాలను దుర్వినియోగం చేయడానికి అనుమతిస్తుందని మైఖేల్ పేర్కొన్నారు.

ఇలాంటి పద్ధతులు లొసుగులు సృష్టిస్తాయని.. దీనివల్ల అమెరికాలో పుట్టిన బిడ్డ దేశ పౌరుడిగా మారిన తరువాత వారు చైనా, భారత్ లేదా ఈ భూమి మీద ఉన్న మరేదైనా నరకప్రాయమైన ప్రదేశం నుంచి మొత్తం కుటుంబాన్ని అమెరికాకు తీసుకువస్తారు అని సావేజ్ జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఇలా అమెరికా పౌరసత్వం లేనివారికి జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వం (Birthright Citizenship) రావడాన్ని మైఖెల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ అంశాన్ని న్యాయస్థానాలకు విడిచిపెట్టకుండా ప్రజాభిప్రాయాలు సేకరించాలని అభిప్రాయపడ్డారు. ఆ లేఖనే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయడంతో భారతీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: ఆర్టీసీ సమ్మెలో తీవ్ర ఉద్రిక్తత.. ఒంటికి నిప్పంటించుకుని డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>