కలం, వెబ్ డెస్క్ : రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల యుద్ధంలో మే 9 నుంచి 11 వరకు మూడు రోజుల పాటు కాల్పుల విరమణ చేస్తూ ట్రంప్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇందులో భాగంగా అన్ని రకాల సైనిక చర్యలను నిలిపివేయడం, ఇరు దేశాల మధ్య వెయ్యి మంది ఖైదీలను పరస్పరం మార్చుకోవడం ఉంటుందని ఆయన (Donald Trump) పేర్కొన్నారు. దీనిపై రష్యా, ఉక్రెయిన్లు కూడా ధృవీకరించాయి.
సూదీర్ఘ యుద్ధానికి ఈ నిర్ణయం నాంది పలుకుతుందని ట్రంప్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఉద్రిక్తతలను ముగించడానికి నిరంతరం పురోగతి ఉంటుందన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా విజయ దినోత్సవం రోజు అయిన మే 9ని పురస్కరించుకుని.. ఈ రోజు రష్యా కాల్పుల విరమణను ప్రకటించింది. కాగా, గతంలో తాము కూడా కాల్పుల విరమణ ప్రతిపాద చేసినా రష్యా పట్టించుకోలేదని ఉక్రెయిన్ ఆరోపించింది.

