తమిళ రాజకీయాల్లో ట్విస్ట్‌: విజయ్ పార్టీపై గవర్నర్‌కు ఫిర్యాదు!

కలం, వెబ్‌ డెస్క్‌ : తమిళనాడు రాజకీయాల్లో (Tamil Nadu Politics) అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే అధినేత విజయ్‌ లక్ష్యంగా ఏఎంఎంకే నేత దినకరన్ పావులు కదపడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తన పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ కొనుగోలు చేసేందుకు టీవీకే ప్రయత్నిస్తోందంటూ దినకరన్ నేరుగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుత రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో అన్నా డీఎంకే అధినేత పళనిస్వామి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని ఆయన గవర్నర్‌ను కోరారు.

ఈ పరిణామాలు ఇలా ఉండగానే రాజ్‌భవన్‌ వద్ద మరో ఆసక్తికర దృశ్యం కనిపించింది. దినకరన్ ఫిర్యాదు చేసిన కేవలం గంట వ్యవధిలోనే ఏఎంఎంకే ఎమ్మెల్యే ఒకరు లోక్‌భవన్‌లో ప్రత్యక్షం కావడం సంచలనం సృష్టించింది. ఒకవైపు ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలు, మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యే తీరుతో దినకరన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఐయూఎంఎల్ సైతం విజయ్ వ్యూహాలకు వ్యతిరేకంగా గళం విప్పుతుండటంతో తమిళ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>